తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగ్‌పూర్‌లోని విద్యానగర్, దుధ్‌మానా అనే గ్రామానికి చెందిన 16 యేళ్ల యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ప్రేమాయణం కొనసాగిస్తూ వస్తోంది. ఇటీవల ఇంట్లో కుటుంబసభ్యులు లేకపోవడంతో తన ప్రియుడిని ఇంటికి పిలిపించి, శారీరకంగా కలుసుకుంది.
అంతే.. ఒక్కసారి షాక్ తిన్న ఆ యువతి.. తమ వ్యవహారం బయటపడుతుందేమోనని ఆందోళనకుగురైంది. తమ బండారాన్ని తమ్ముడు ఎలాగైన తల్లిదండ్రులకు చెబుతాడని, తమ్ముడిని అంతమొందిస్తే తప్ప విషయం బయటకు రాదని చాలా దారుణంగా ఆలోచించింది.
తన ప్రియుడితో కలిసి తమ్ముడిని అతి దారుణంగా గొంతు పిసికి హత్య చేసింది. కొడుకు మృతిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో యువతిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.