తాజాగా.. సుప్రీంకోర్టులో 15 మంది న్యాయమూర్తులకు కరోనా సోకినట్లు తేలింది. అందులో ఒకరు ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అదేసమయంలో, తమ సిబ్బందికి కరోనా సోకిందని.. న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సూర్యకాంత్‌లు వెల్లడించారు.
పరిమిత కేసులు.. వర్చువల్ వాదనలు
తొలి దశలో కరోనా వ్యాప్తి సందర్భంగా సుప్రీంలో ఎటువంటి పరిస్థితి ఉండేదో.. ప్రస్తుతం అదే విధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. న్యాయమూర్తులు తమ స్వస్థలాల నుంచే వర్చువల్‌గా వాదనలు వింటున్నారు. ఇప్పుడు.. 11 న్యాయమూర్తులతో కూడిన నాలుగు బెంచీలు వాదనలు ఆలకిస్తున్నాయి. పరిమితమైన కేసులను మాత్రమే విచారిస్తున్నారు.
సుప్రీంలోని న్యాయమూర్తులందరికీ నెల క్రితమే వ్యాక్సిన్ అందించారు. న్యాయవాదులు, సిబ్బందికి టీకా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లక్షణాలు ఉన్నవారికి ఆర్టీ - పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది న్యాయస్థానం. కరోనా లక్షణాలు కనిపిస్తే కోర్టుకు రావొద్దని సూచించింది.