బాయ్‌ఫ్రెండ్‌తో వెళ్లింది.. దాచడం కోసం కిడ్నాప్ డ్రామా వేసింది..

బుధవారం, 1 జనవరి 2020 (13:37 IST)
ఓ యువతి బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగేది. అలా ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కాలేజీ ముగించుకుని షికారుకు వెళ్లింది. కానీ ఆ నాగ్‌పూర్ యువతి కిడ్నాప్ డ్రామా లేటుగా వెలుగులోకి వచ్చింది.  
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన ఓ యువతి కాలేజీ ముగించుకుని బాయ్‌ఫ్రెండ్‌తో షికారుకెళ్లింది. ఇంట్లో ఎక్కడికెళ్లావని ప్రశ్నించగా భయపడి తనను నలుగురు వ్యక్తులు కారులో బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేశారని, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారని, ఆపై వారి నుండి తప్పించుకొని వచ్చానని కిడ్నాప్ డ్రామా ఆడింది. 
 
దీంతో యువతి తల్లిదండ్రుల జరిగిన విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టారు. ఆ యువతిని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి కాలేజీ వద్ద సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, అందులో ఆమె కాలేజీ ముగించుకుని బాయ్‌ఫ్రెండ్ బైక్‌పై బయటకు వెళ్లడాన్ని గుర్తించారు. దీంతో తల్లిదండ్రుల సమక్షంలోనే ఆమెను పోలీసులు నిలదీయగా.. తాను కట్టుకథ చెప్పినట్లు అంగీకరించిందని వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు