దేశ రాజధాని ఢిల్లీ సివిల్ సర్వీస్ అభ్యర్థి అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడి మృతికి అగ్నిప్రమాదం కారణం కాదని, అతడితో సహజీవనం చేస్తున్న యువతే మరో ఇద్దరితో కలిసి హత్యకు పాల్పడినట్టు తేలిది. అతడు అగ్నిప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించేందుకు మృతదేహంపై నెయ్యి, నూనె, చల్లి, సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ చేసి పేలుడు జరిగేలా చేసినట్టు వెల్లడైంది.
ఈ నెల 6వ తేదీ తిమార్‌పూర్‌లోని ఓ భవనంలో పేలుడు సంభవించింది. అక్కడి ఫ్లాట్‌లో కాలిపోయిన మృతదేహం కనిపించింది. మృతుడిని రామ్‌కేశ్ మీనా (32)గా గుర్తించారు. పేలుడుకు ముందు ఇద్దరు వ్యక్తుల ముఖాయలకు ముసుగులు ధరించి భవనం లోపలకు వెళ్లినట్టు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. కాసేపటి తర్వాత వారితోపాటు ఓ యువతి కూడా బయటకు వచ్చింది. వీరు వెళ్లిపోయిన కాసేపటికే భవనంలో పేలుడు జరిగింది.
ఆ యువతిని ఫోరెన్సిక్ విద్యార్థిని అమృత చౌహాన్ (21)గా గుర్తించారు. అమృత ప్రైవేటు వీడియోలను రాకేశ్ రికార్డు చేశాడని, వాటిని డిలీట్ చేసేందుకు అంగీకరించకపోవడంతో అమృత తన మాజీ ప్రియుడు, మరో స్నేహితుడితో కలిసి అతడిని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.