గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో గురువారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైనట్టు ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మాలాజికల్ రీసెర్స్ (ఐఎస్ఆర్) వెల్లడించింది. భూకంపం ఉదయం 9.52 గంటల ప్రాంతంలో సంభవించిందని తెలిపింది. కచ్ జిల్లాలోని బేలాకు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్టు ఐఎస్ఆర్ పేర్కొంది.
ఈ స్వల్ప భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని జిల్లా విపత్తుల నిర్వహణ అధికారి వెల్లడించారు. కచ్ జిల్లా భూకంపానికి వైరీ హై రిస్క్ జోన్ అని పేర్కొన్నారు. తక్కువ ప్రకంపనలతో ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తాయన్నారు. కాగా, 2001లో సంభవించిన భూకంపం వల్ల కచ్‌లో 1380 మందికిపైగా చనిపోయిన విషయం తెల్సిందే. అలాగే, 1.67 లక్షల మంది గాయపడ్డారు.