కన్నడ కుర్చీ కోసం కమలనాధులు 3 మార్గాలు... ఏంటవి?

మంగళవారం, 15 మే 2018 (21:51 IST)
కర్నాటకలో భారతీయ జనతా పార్టీకి పూర్తి ఆధిక్యత రాకపోవడంతో ఎలాగైనా సీఎం పీఠం కైవసం చేసుకోవాలని కమలనాధులు భావిస్తున్నారు. అందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. కర్నాటక కుర్చీ దక్కాలంటే బీజేపీ ముందు మూడు మార్గాలున్నాయి. సిద్ధరామయ్యను నమ్మి జేడిఎస్‌ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరి గెలిచిన ఎమ్మెల్యేలను ఆకర్షించడం.
 
ఎందుకంటే కుమారస్వామి సీఎమ్ అయితే వాళ్లకి పెద్దగా లాభముండదు గనుక వారిని తమ వైపునకు తిప్పుకోవడం. రెండవది, రేవణ్ణ‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆయన అనుచరులకు మంత్రి పదవులు కేటాయించడం. ఇక మూడవది కాంగ్రెస్‌లో వుండి కుమారస్వామితో బహిరంగ విబేధాలున్న శివకుమార్ వర్గీయలను ఆకట్టుకోవడం ద్వారా తమ ప్రయత్నాలు మమ్మురం చేసే ఆలోచనలో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు.
 
ఎలాగూ గవర్నర్ బలనిరూపణకు అవకాశం‌ ఇస్తారు గనుక ఈ లోగా ఆపరేషన్ కమలను పూర్తి చేయాలని బీజేపి ఫిక్స్ అయ్యినట్టు సమాచారం. ఇందులో భాగంగానే శ్రీరాములు హుటాహుటిన బెంగుళూరు బీజేపి ఆఫీస్‌కు చేరుకుని మంతనాలు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు