ఉత్తర భారతాన్ని పిడుగులు, వర్షాలు కుదిపేస్తున్నాయి. వీటి ధాటికి ఇప్పటికే 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భీకరవర్షాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ భీకర వర్షాలు ఉత్తరప్రదేశ్, బీహార్‌తో పాటు పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్‌లోనూ కొనసాగుతున్నాయి.
సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పిడుగుల కారణంగా 10 మంది మృతిచెందగా ఆరుగురు గాయపడ్డారు. జార్ఖండ్‌లో ఆదివారం బలమైన గాలులు, భీకర తుపానుతో పెద్ద ఎత్తున వృక్షాలు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. 13 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో మృతి చెందిన వారి సంఖ్య మంగళవారానికి 17కు చేరింది. అలాగే, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు ఐఎండీ పేర్కొంది.