భార్య పుట్టింటికి వెళ్లిందనీ.. భర్త బలవన్మరణం

ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (11:24 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. భార్య పుట్టింటికి వెళ్లిందని ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగ్‌పూర్‌కు చెందిన అమర్ శివలాల్‌ చౌదరి (40) ఓ అధికారి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లాక్డౌన్‌ సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడతుండేవాడు. 
 
ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో గత నెల భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన అతడు శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు వద్ద సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అజ్ని పోలీస్‌ స్టేషన్‌ అధికారి పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు