మదర్సాలో బాలికపై అత్యాచారం- వేధింపులు.. 51మంది బాలికలకు విముక్తి

ఆదివారం, 31 డిశెంబరు 2017 (14:06 IST)
దేశంలో మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో మహిళలపై అఘాయిత్యాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ మదర్సాలో లైంగిక వేధింపుల బారి నుంచి 51 మంది బాలికలకు పోలీసులు విముక్తి కల్పించారు.
 
మహిళలపై వయోబేధం లేకుండా లైంగిక వేధింపులు జరుగుతున్న నేపథ్యంలో మదర్సాల్లోని బాలికలపై వేధింపులకు గురిచేసిన మదర్సా కన్వీనర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లక్నోలోని మదర్సా విద్యా సంస్థ కన్యీనర్ తయ్యబ్ జియా తనపై అత్యచారానికి పాల్పడటమే కాకుండా.. హింసించినట్లు ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 51 మంది విద్యార్థినులకు కాపాడారు. 
 
యూపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 126 మంది బాలికలు ఉండగా, వీరిలో ఏడుగురు బాలికలు కన్వీనర్‌కు వ్యతిరేకంగా లైంగిక వేధింపులు, అత్యాచారయత్నంపై ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు