క్లాస్ టీచర్‌పై అసభ్యరాతలు.. 88 మంది బాలికల దుస్తులు విప్పదీసి..

గురువారం, 30 నవంబరు 2017 (11:22 IST)
క్లాస్ టీచర్‌పై అసభ్యరాతలు రాశారనే ఆరోపణలతో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో 88 మంది బాలికలను బట్టలూడదీసి నిలబెట్టారు. పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికా పాఠశాలలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. హప్పాలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలలో ఇద్దరు అసిస్టెంట్ టీచర్లు, ఓ జూనియర్ టీచర్‌ కలిసి బాలికల దుస్తులిప్పి నిలబెట్టారు. 
 
క్లాస్ టీచర్ పై ఓ స్టూడెంట్ అసభ్యరాతలు రాయగా, ఆ కాగితం ముక్క కోసం మిగతా విద్యార్థుల ముందు బట్టలు ఊడదీయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బయటికి చెప్పే అంతే సంగతులు అంటూ హెచ్చరించారు. అయితే బాధిత బాలికలు ఆల్ సగాలీ స్టూడెంట్స్ యూనియన్ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉదంతం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటన నిజమేనని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆరు, ఏడు తరగతులు చదివే బాలికల దుస్తులు విప్పి.. ఇలాంటి దారుణ శిక్షను విధించారని పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు