మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం - 9 మంది దుర్మరణం

గురువారం, 19 జనవరి 2023 (12:56 IST)
మహారాష్ట్రలోని రాయగఢ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ముంబై - గోవా రహదారిపై గురువారం ఉదయం 4.45 గంటలకు లారీ -  కారును ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వ్యానులో ఉన్నవారంతా బంధువులే కావడం గమనార్హం. వీరంతా కలిసి రత్నగిరి జిల్లాలోని గుహాగర్‌కు బయలుదేరారు. 
 
ఆ సమంయలో ముంబై వెళుతున్న లారీ ఒకటి కారును ఢీకొట్టింది. దీంతో ఒక బాలిక, ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నాలుగేళ్ల బాలుడు గాయపడ్డారు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు