క్రీడాస్ఫూర్తి అంటే ఇదే కదా... ఊతకర్రలతో ఫుట్ బాల్ (వీడియో)
మంగళవారం, 17 జనవరి 2023 (20:29 IST)
Foot Ball
ప్రత్యేక సామర్థ్యం ఉన్న పురుషులు ఆడిన ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇష్టం అనేది దేనినైనా సులువు చేస్తుందనేందుకు ఈ మ్యాచే నిదర్శనం.
ఐపీఎస్ అధికారి సంతోష్ సింగ్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో స్పెయిన్- ఇంగ్లండ్‌ల మ్యాచ్‌ను చూడొచ్చు. అయితే ఈ ఆటగాళ్ళు ఊతకర్రలను ఉపయోగిస్తున్నారు.
ఆటగాళ్ల సంకల్పం వారి అంతర్గత బలం, సానుకూల స్ఫూర్తిని ప్రదర్శించే నైపుణ్యాలు నిజంగా ఆకట్టుకున్నాయి. ఈ వీడియోకు ఇప్పటికే భారీ వ్యూస్ వచ్చాయి. లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వీడియోకు నెటిజన్ల నుండి అనేక సానుకూల స్పందనలు వస్తున్నాయి. ఈ వీడియో మన లక్ష్యాలను సాధించడంలో ఏర్పడే అడ్డంకులతో నిరుత్సాహపడకూడదనే విషయాన్ని విస్మరించకూడదని చెప్తోంది.