వృద్ధుడిపై పగబట్టిన ఆవు?!! రోడ్డుపై పరిగెత్తించి కిందపడేసి... (video)

ఐవీఆర్

శనివారం, 20 సెప్టెంబరు 2025 (16:49 IST)
త్రాచు పాములు పగపడతాయి అంటుంటారు. ఐతే ఇక్కడ ఓ ఆవు పగబట్టిందా అన్నట్లు ఓ ఘటన జరిగింది. ఓ వృద్ధుడిని వెంబడించిన ఆవు అతడిని కిందపడేసి తీవ్రంగా దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
పూర్తి వివరాలు చూస్తే... ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కల్యాణ్ పూర్ రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న ఓ వృద్ధుడిని ఆవు వెంబడించింది. అలా వెంబడిస్తుండటంతో అతడు రోడ్డుపై పడిపోయాడు. సహజంగా మనుషులు కిందపడిపోతే ఆవులు ఏమీ చేయవంటారు కానీ ఈ ఆవు మాత్రం కిందపడిన వృద్ధుడిని వదల్లేదు. కొమ్ములతో పొడుస్తూ తీవ్రంగా దాడి చేసింది.
 
రోడ్డుపై వెళ్లేవారు కర్రలతో దాన్ని ఎంత కొట్టినా వృద్ధుడిపై దాడిని మాత్రం అది ఆపలేదు. ఇంతలో ఓ ఆటోరిక్షా డ్రైవర్ తన ఆటోని అక్కడికి తీసుకువచ్చి వృద్ధుడిని కాపాడి ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. అందుకే రోడ్లపై పశువులు వున్నప్పుడు జాగ్రత్త వహించాలని చెబుతారు.

పగబట్టిందా అన్నట్లుగా ఓ ఆవు రోడ్డుపై వెళ్తేన్న వృద్ధుడిపై దాడి చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. UPలోని కళ్యాణ్‌పూర్‌లో ఓ వృద్ధుడిని ఆవు వెంటాడింది. పరిగెడుతూ కింద పడిపోవడంతో కొమ్ములతో దాడి చేసింది. స్థానికులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించినా అది వెనక్కి తగ్గలేదు. దీంతో ఓ ఆటో… pic.twitter.com/FOJSrYDV2A

— ChotaNews App (@ChotaNewsApp) September 20, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు