యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

ఠాగూర్

సోమవారం, 21 జులై 2025 (14:24 IST)
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఓ దారుణం జరిగింది. ఒక వృద్ధుడు ఒక యువతిని కత్తితో బెదిరించి యేడాదికాలంగా అత్యాచారం చేసున్నాడు. ఈ నెల 13వ తేదీన తన తమ్ముడితో కలిసి వెళుతుండగా మళ్లీ బెదిరించాడు. ఆ తర్వాత ఆ యువతి మెడలో దారం వేసి ఫోటో దిగి పెళ్ళయినట్టుగా చిత్రీకరించడంతో ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో వారు బాధితురాలిని పోలీసుల వద్దకు తీసుకెళ్లారు. 
 
ఈ ఘటన చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఆదివారం వెలుగు చూసింది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మండలానికి చెందిన 22 యేళ్ల యువతి కొంత వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా అదే గ్రామానికి చెందిన వరుసకు మామ అయ్యే 60 యేళ్ళ వృద్ధుడు యువతిని కత్తితో బెదిరించి యేడాది కిందట యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత పలుమార్పు బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబుతానని యువతి అనడంతో మీ నాన్న తాగే మద్యంలో విషం కలిపి చంపుతా అని బెదిరించినట్టు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు