Kaarthika Pournami: 19న సుదీర్ఘ పాక్షిక చంద్ర గ్రహణం

శనివారం, 6 నవంబరు 2021 (21:35 IST)
ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహణం (Century Longest Lunar Eclipse) నవంబరు 19న ( కార్తిక పౌర్ణమి నాడు )వినువీధిలో దర్శనమివ్వబోతుంది. 
 
ఇదే విషయాన్ని శనివారం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ (నాసా) ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుండగా..
 
భారతకాలమానం ప్రకారం నవంబరు 19న శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి .. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. 
 
3 గంటల 28 నిమిషాల పాటు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణం.. చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చంద్రుడు ఎవరికీ కనిపించకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుంది. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం. 
 
ఈ ఏడాది తొలి చంద్ర గహణం.. మే 26 రోజున (వైశాఖ పౌర్ణమి) నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. నిండు చంద్రుడు ఆరోజు అరుణవర్ణంలో కనువిందు చేశాడు. దీన్నే బ్లడ్‌ మూన్ (Blood moon), సూపర్‌ మూన్‌ (Super Moon) అని అంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు