నటుడు సురేష్ గోపి మరో మైలురాయి - మోడీ కేబినెట్‌లో చోటు!!

వరుణ్

ఆదివారం, 9 జూన్ 2024 (19:31 IST)
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రివర్గంలో కేరళ సినీ నటుడు సురేశ్ గోపికి చోటు కల్పించారు. త్రిస్సూర్ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి పోటీ చేసిన సురేశ్ గోపీ సంచలన విజయం సాధించారు. ఈయన 75 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మోడీ చేపట్టిన ఎన్నికల ప్రచారంలో త్రిసూర్‌లో బీజేపీ అభ్యర్థికి కేంద్ర మంత్రి పదవి... ఇది మోడీ హామీ అంటూ పదేపదే ప్రస్తావించారు. దీంతో ఆయనకు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. 
 
సురేశ్ గోపి దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించారు. 2016 ఏప్రిల్ నెలలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు 2019 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2021 త్రిసూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ పోయారు. ఈ క్రమంలో 2024లో జరిగిన ఎన్నికల్లో ఆయన మళ్లీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు