ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే అందని ద్రాక్షగా నోరూరిస్తూ ఉండేది. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు కూడా విమానంలో ప్రయాణించే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదటిసారిగా విమానం ఎక్కేవారు గందరగోళానికి గురై చేసే పనులు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే, మరికొన్నిసార్లు కోపం తెప్పించేలా, భయం కలిగించేలా ఉంటాయి.
అలాంటి సంఘటనే ఈమధ్య చోటుచేసుకుంది. అసలే విమాన ప్రయాణంలో రిస్క్‌లు అధికం. వాతావరణం దగ్గర నుండీ విమానం పనితీరు వరకు ప్రతిదీ పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఇలాంటివి కూడా తోడైతే ఇత చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రయాణికులు విమానం ఆకాశంలో వెళ్తుండగా ఎగ్జిట్ డోర్ తీయడానికి ట్రై చేసాడు. అది చూసిన మరో ప్రయాణికుడు కేకలు పెట్టడంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఢిల్లీ నుండి పాట్నాకు వెళ్తున్న జీ8 గో-ఎయిర్ విమానంలో జరిగింది.