వీటిలో తెలుపు, బూడిద రంగు నారాయణ పక్షులు సర్వసాధారణమని, ఎరుపు రంగు పక్షిని చూడడం ఇదే తొలిసారని ఆశ్చర్యపోతున్నారు. ఇతర పక్షుల గుంపులతో ఎగురుతూ సందడి చేస్తున్న ఈ అరుదైన పక్షుల కోసం పక్షి ప్రేమికులు కెమెరాలకు పనిచెబుతున్నట్లు స్థానికులు వెల్లడించారు. బిత్తర్‌కనిక నేషనల్ పార్కుకి సమీపంలో ఇవి కనిపిస్తున్నాయి.
ఆహార వేటలో ఇతర పక్షులతో కలసి ఈ పక్షులు ఇక్కడికి వలస వచ్చి ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి వాతావరణం వీటికి అనుకూలంగా ఉండి, సంతతి వృద్ధి చెందితే అరుదైన పక్షుల జాబితాలో సరికొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందని పక్షి ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీటికి వేటగాళ్ల నుంచి రక్షణ కల్పించేలా అటవీశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.