మధ్యప్రదేశ్ నగరం ఇండోర్, ఖుడైల్ లోని క్రెసెంట్ వాటర్ పార్క్‌లోని అపోలో డిబి సిటీలో నివశిస్తున్న ఒక ఇంజనీర్, అతని భార్యతో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. నలుగురూ విషపూరిత వస్తువులను తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారని ప్రాధమికంగా వెల్లడైంది. క్రెసెంట్ వాటర్ పార్కులో ఒక రిసార్ట్ ఉంది. ఇక్కడ అతిథులు కూడా అద్దెకు గదులు తీసుకుంటారు.
డిబి సిటీలో నివసిస్తున్న అభిషేక్ సక్సేనా (45) ఒక రోజు ముందు గదిని అద్దెకు తీసుకున్నాడు. గురువారం కుటుంబ సభ్యులు గది నుండి బయటకు రాకపోవడంతో, రిసార్ట్ సిబ్బందికి అనుమానం వచ్చి తలుపు కొట్టారు. కానీ ఎంతకీ తలుపులు తీయకపోవడంతో మాస్టర్ కీ ఉపయోగించి తలుపులు తెరిచినప్పుడు గది లోపల నలుగురు విగతజీవులుగా కనబడ్డారు.
దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతులను అభిషేక్ సక్సేనా(45), అతని భార్య ప్రీతి సక్సేనా (42), కుమారుడు అద్వైత్ (14), కుమార్తె అనన్య(14) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నలుగురి శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఒక విషపూరిత రసాయనం సమీపంలో కనబడింది. వారంతా ఈ రసాయనాన్ని తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. కాగా వారి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి వుంది.