నోట్ల కట్టలు దాచుకోవడానికి భవనాలా: మాజీమంత్రిపై చెప్పు విసిరిన మహిళ

బుధవారం, 3 ఆగస్టు 2022 (11:17 IST)
మాజీ మంత్రి పార్థా ఛటర్జీ పైకి ఓ మహిళ చెప్పు విసిరింది. ఈడీ కేసులో చిక్కిన పార్థా ఛటర్జీని మంగళవారం నాడు ఆసుపత్రిలో పరీక్షలు చేయించి బయటకు తీసుకువస్తున్న సమయంలో ఓ మహిళ తీవ్ర ఆగ్రహంతో తన కాలికి వున్న చెప్పును తీసి అతడిపైకి విసిరింది. తమ బిడ్డలు చదువుకుని ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతుంటే మీలాంటివారు కోట్లకు కోట్లు వెనకేసుకుని ఆ డబ్బంతా దాచుకునేందుకు భవనాలు కడతారా అంటూ చెప్పు విసిరింది.

 
ఐతే ఆ చెప్పు గురి తప్పడంతో పార్థా ఛటర్జీ పక్కన పడింది. ఈ పరిణామంతో అక్కడున్నవారు షాకయ్యారు. వెంటనే మాజీమంత్రిని అక్కడి నుంచి తరలించారు. కాగా రాష్ట్రంలో తనలానే ప్రజలు ఆగ్రహంతో వున్నారని ఆమె చెప్పారు. అతడిపైకి విసిరిన చెప్పున మళ్లీ ధరించబోనని ఆమె వెల్లడించారు.

 
పార్థా ఛటర్జీకి సంబంధించి ఇప్పటివరకూ రూ. 50 కోట్ల మేర నగదు, బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. పార్థాతో పాటు ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు