ఆరుషి హత్య కేసు : తల్వార్ దంపతులు విడుదల

మంగళవారం, 17 అక్టోబరు 2017 (05:47 IST)
కన్నబిడ్డ ఆరుషి, పనిమనిషి హేమరాజ్ హత్య కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తూ వచ్చిన తల్వార్ దంపతులు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం విడుదలయ్యారు. ఈ కేసులో రాజేష్, నూపుర్ తల్వార్‌ దంపతులు గత 2013 నుంచి దాస్నా జైలులోనే గడుపుతూ వచ్చారు. వీరిద్దరూ సోమవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని దస్నా జైలు నుంచి విడుదలయ్యారు. 
 
ఈ సందర్భంగా జైలు వెలుపల పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నాలుగేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన తల్వార్ దంపతులు తమ లగేజీతో సహా నడుచుకుంటూ బయటకు వచ్చారు. వారిని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు, మీడియా అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని కారులో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.
 
ఆరుషి హత్య కేసులో నూపూర్, రాజేష్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు ఈనెల 12న సంచలన తీర్పునిచ్చింది. వారిని జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసిన అధికారులు.. సోమవారం సాయంత్రం వారిని జైలు నుంచి విడుదల చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు