అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) తాజాగా విడుదల చేసిన భారతదేశం-అసాంక్రమిక వ్యాధుల భారం నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. హైపర్‌టెన్షన్, జీర్ణకోశ వ్యాధులు, మధుమేహంతో ఎక్కువమంది బాధపడతున్నారు. ఈ వ్యాధులతో పోల్చితే క్యాన్సర్ బారిన పడుతున్నవారి సంఖ్య తక్కువగా ఉంది.
21 రాష్ట్రాల్లో 2,33,672 మందిపై సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు. అసాంక్రమిక వ్యాధుల బారిన పడుతున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు 26-59 ఏండ్ల లోపు వారే. వాయు కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం, సమతులాహారం తీసుకోకపోవడం, జీవన శైలిలో మార్పులు అసాంక్రమిక వ్యాధుల వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక తెలిపింది.