రేప్ చేసిన వారు ధైర్యంగా రోడ్డుపై తిరుగుతున్నారు: పాయల్ ఘోష్ (video)

గురువారం, 1 అక్టోబరు 2020 (12:03 IST)
సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నటి పాయల్ ఘోష్ మంగళవారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారిని కలిశారు. గవర్నర్‌ను కలిసిన తర్వాత బయటకు వచ్చిన ఆమె, తను చేస్తున్న ఈ పోరాటంలో గవర్నర్ తమతో వుంటానని మాకు చెప్పారని వెల్లడించారు.
 
నా రక్షణ కోసం వారిని అడిగాను. దీనితో పాటు, ఈ విషయంలో జోక్యం చేసుకుంటూ అనురాగ్ కశ్యప్‌ను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులు బహిరంగంగా రోడ్డుపై తిరుగుతున్నారని ఆమె విమర్శించారు.
 
ఆమెతో పాటు కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే ఉన్నారు. కశ్యప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి ఆరోపించింది. ఈ మేరకు ఘోష్ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేను కలిశారు. అత్యాచారానికి సంబంధించిన వివిధ సెక్షన్ల కింద అనురాగ్‌పై కేసు నమోదు చేయగా, ఈ కేసుపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, అనురాగ్‌ను ఇంకా ప్రశ్నించడానికి పిలవలేదు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు