వడ్డీలు, పెనాల్టీలు మొదలైనవి తొలగించడం సహా ఊరట చర్యలు తీసుకోవాలని టెలికాం శాఖ (డాట్)ను కోరాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. డాట్ నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే టిలికాం కంపెనీలు లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ ఫీజులు చెల్లించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ.21,000 కోట్లు కట్టాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్‌ఎన్ఎల్) తన చందాదారులకు అద్భుత ఆఫర్ తీసుకొచ్చింది. పండుగ సీజన్ సందర్భంగా ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ రూ .1,699 వార్షిక ప్రీ పెయిడ్ ప్లాన్‌పై 90 రోజులు అదనంగా ఫ్రీ డేటా అందించనుంది. అక్టోబర్ 31 లోపు రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తించనున్నట్లు సంస్థ తెలిపింది.