మరోమారు మండిన గ్యాస్ ధర

బుధవారం, 4 సెప్టెంబరు 2019 (19:39 IST)
గృహ వినియోగదారులపై గ్యాస్‌ కంపెనీలు అదనపు భారం వెూపాయి. పద్నాలుగు కిలోల బరువున్న సిలెండర్‌ ధరను 16 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను ఆయిల్‌ కంపెనీలు సవరిస్తుంటాయి. ఇందులో భాగంగా ఈ నెల ఒకటో తేదీనే సంస్థలు పెంపు నిర్ణయం తీసుకున్నాయి. కొత్త ధరలు చవితి ముందు రోజు నుండే అమల్లోకి వచ్చాయి. గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరను రూ.590.50 నుంచి 606.50 కు పెంచారు.

వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్‌ ధరను 1123 రూపాయల నుంచి 1174 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయిల్‌ సంస్థలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు