ఏసి చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ల ధరలపై రాయితీ

బుధవారం, 28 ఆగస్టు 2019 (19:14 IST)
ఏసి చైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ల ధరలపై రాయితీ పథకం వచ్చే నెల సెప్టెంబర్ చివరి నుండి అమలులోకి రానుంది. ఈ రాయితీ పథకం శతాబ్ది, గతిమాన్, తేజస్, డబుల్ డెక్కర్, ఇంటర్ సిటి మొదలైన రైళ్లలోని ఏసి చైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ల సదుపాయానికి మాత్రమే వర్తింపబడుతుంది.

ఈ రాయితీలు కల్పించే అధికారాన్ని జోనల్ రైల్వేకి చెందిన ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు ఇస్తూ ఈ మేరకు రైల్వే బోర్డు కమర్షియల్ డైరెక్టరేట్ నుండి అన్ని జోనల్ రైల్వేలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గత సంవత్సరం  50శాతం కంటే తక్కువ భర్తీశాతంతో నడిచిన రైళ్లకే ఈ రాయితీ కల్పించబడుతుంది.

ప్రాథమిక టిక్కెట్ ధరపై 25శాతం రాయితీ ఇవ్వబడుతుంది. రిజర్వేషన్ ఛార్జి, సూపర్ ఫాస్ట్ ఛార్జి, జిఎస్టి మొదలైనవన్నీ అదనం. ప్రయాణ దూరం ప్రారంభ స్టేషన్ నుండి చివరి స్టేషన్ వరకు, లేదా మధ్యలోని ముఖ్య మైన స్టేషన్ల మధ్య ప్రయాణానికి ఈ రాయితీ వర్తిస్తుంది.

ఈ రాయితీలు టిక్కెట్లపై కేటరింగ్ వద్దు/ కావాలి అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రాయితీ సంవత్సరం మొత్తంగాని, సంవత్సరంలో కొంతకాలానికి గాని లేదా నెలవారీ గాని లేదా సీజనల్ గానీ లేదా వారానికి వారాంతానికి అనుకూలంగా కల్పించబడతాయి.

అన్ని రైళ్లలోని కూర్చొనే సదుపాయంగల ఛైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్లకు సంబంధించిన భర్తీ పరిస్థితిని సెప్టెంబర్ 30లోగా సమీక్షించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని రైల్వే బోర్డు కమర్షియల్ డైరెక్టరేట్ నుండి అన్ని జోనల్ రైల్వేలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ రాయితీ పథకం రైళ్లలో సీట్ల భర్తీని మెరుగుపరచడానికి మరియు ఆదాయం వృద్ధికి ఉద్దేశించబడిందని రైల్వే శాఖ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు