తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళ మేనల్లుడు, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన టీటీవీ దినకరన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీటీవీ దినకరన్ నోరు తెరిస్తే అసత్యాలు పలకడం తప్ప ఇంకేమీ తెలియదన్నారు. అతనొక 420 అని విషయాన్ని తన వద్ద స్వయంగా చెప్పారని ఓపీఎస్ అన్నారు.
ఓపీఎస్ దినకరన్‌పై మాట్లాడుతూ.. దినకరన్ అబద్ధాల పుట్ట అనేందుకు ఓ ఉదాహరణ కూడా చెప్పారు. ఓపిఎస్‌ను తానే అమ్మకు పరిచయం చేశానని దినకరన్ అన్నారు. అయితే దినకరన్ కంటే 18 సంవత్సరాల ముందే తాను పార్టీలో పలు బాధ్యతలు చేపట్టానని ఓపీఎస్ వివరించారు. దినకరన్ అసత్యాలు పలికే వ్యక్తి అనేందుకు ఇంతకంటే నిజం ఏం కావాలన్నారు.