ఉరి తీయలేరు కదా.. మహా అయితే, జైలుకు పంపుతారు : టీటీవీ దినకరన్

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (10:01 IST)
తనపై నమోదవుతున్న కేసులపై అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ స్పందించారు. 30 యేళ్ల వయసు నుంచే తాను కేసులను ఎదుర్కొంటున్నానని గుర్తుచేశారు. ఇలాంటి కేసులు ఎన్నో చూశానని చెప్పారు. మహా అయితే, జైలుకు పంపిస్తారే కానీ, ఉరితీయలేరు కదా అని ఆయన ప్రశ్నించారు. 
 
జయలలిత మరణం, అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్లడం, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకం, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు రూ.89 కోట్ల మేరకు డబ్బులు పంపిణీ చేయడం, రెండాకుల గుర్తును స్వాధీనం చేసుకునేందుకు ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపినట్టు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం, పెండింగ్‌లో ఉన్న ఫెరా కేసు విచారణ వేగవంతం కావడం ఇలా ఒకాదాని తర్వాత ఒకటి కష్టాలు ఎదురవుతుండటంపై దినకరన్ పై విధంగా స్పందించారు. 

వెబ్దునియా పై చదవండి