అమెరికా నుంచి అహ్మదాబాద్‌‌కు భారతీయులు.. ట్రంప్ అంత పని చేశారా? చేతులు కట్టేసి? (video)

సెల్వి

గురువారం, 6 ఫిబ్రవరి 2025 (14:22 IST)
Indians
అమెరికా నుండి బహిష్కరించబడిన భారతీయులు అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. 104 మంది అక్రమ భారతీయ వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం బుధవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. అమెరికాలో బహిష్కృత భారతీయుల్లో 104 మందిలో 33 మంది గుజరాత్‌కు చెందినవారని తెలుస్తోంది. 
 
పంజాబ్‌లోని అమృత్స‌ర్ ఎయిర్‌పోర్టులో స్పెష‌ల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అక్ర‌మంగా నివ‌సిస్తున్న‌ భార‌తీయుల‌ను వదిలిపెట్టేశారు. అలా స్వ‌దేశానికి చేరిన వారు చెప్తున్న విషయాలు సంచలనంగా మారుతున్నాయి. 
 
విమానంలో వారిని కూర్చోబెట్టి కాళ్లు చేతులను గొలుసులతో కట్టేసి ఉంచారట‌. స్వదేశంలో దిగే వరకు అలానే ఉంచారని మొదటి బ్యాచ్‌లో వచ్చిన భారతీయులు చెబుతున్నారు. 
 
అలాగే అక్రమ వలస దారులుగా గుర్తించిన భారతీయులను ప్రత్యేక క్యాంపులకు తరలించి అక్కడ ఎవరితోనూ మాట్లాడనీయకుండా చేశారని టాక్ వస్తోంది. కాగా.. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ప‌దివి చేప‌ట్టిన త‌ర్వాత అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.

VIDEO | Gujarat: Indians deported from the US arrive at Ahmedabad airport. A US military aircraft carrying 104 illegal Indian immigrants landed at Amritsar, Punjab, yesterday. Sources said that 33 of the 104 deportees are from Gujarat.#GujaratNews

(Full video available on PTI… pic.twitter.com/2y1P9Zoo6R

— Press Trust of India (@PTI_News) February 6, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు