ఇటీవల యూపీపీఎస్సీ, పీసీఎస్ (జే) పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో అలహాబాద్‌లోని గోవింద్‌పూర్‌కు చెందిన ఓ యువతి తన తొలి ప్రయత్నంలోనే 54వ ర్యాంకు సంపాదించింది. దీంతో మీడియా ఆమెను తొలి ప్రయత్నంలోని సివిల్ జడ్జి పరీక్షలో విజేతగా నిలవడంపై అభినందించింది.
ఈ సందర్భంగా ఇంటర్వూలో తాను ఎదుర్కొన్న ప్రశ్న, జవాబును ఆమె వివరించింది. ఇంటర్వ్యూ హాల్‌లో అడుగుపెట్టిన ఆకృతితో బోర్డు మెంబర్లు... "ఒకవేళ మీ భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, చాలా దూరంలో పని చేస్తున్నారనుకుందామనుకోండి.. నేను ఉద్యోగం చేస్తాను... నువ్వు మానెయ్ అని అడిగితే ఏం చేస్తారు?" అని ప్రశ్నించారు.
దానికి ఆమె సమాధానం ఇస్తూ... ‘నాకు కుటుంబం కూడా ముఖ్యమే. కుటుంబంతో ఉండటాన్ని నేను బాగా ఇష్టపడతాను. అయితే నా భర్త ఉద్యోగం మానేయమని అడిగితే ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాను. మొదట్లో అతను ఒప్పుకోకపోవచ్చు. అయినా ప్రయత్నిస్తాను. అతన్ని ఒప్పంచగలననే నమ్మకం నాకుంది’ అంటూ చెప్పింది. దీనికి ముగ్దులైన ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లు ఆమెను ఉత్తీర్ణురాలిని చేశారని తెలిపింది.