కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రభుత్వశాఖలకు చెందిన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యాన్ని కల్పించింది. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సింహభాగం తమ ఇళ్ళ వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇకపై ఉద్యోగులందరూ ఆఫీసులకు రావాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వాళ్లకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పటివరకూ అండర్ సెక్రటరీ, ఆపై స్థాయి అధికారులు మాత్రమే ఆఫీసులకు వస్తున్నారు. కరోనా కారణంగా గతేడాది మార్చి నుంచి ఇదే విధానం అమలు చేస్తున్నారు.