నేను ఎవ్వరినీ శిష్యుడు అని పిలవను. కానీ బుచ్చిబాబును అలా అంటాను అని `ఉప్పెన` ప్రీరిలిజ్ వేడుకలో దర్శకుడు సుకుమార్ అన్నాడు. ఇక ఇప్పుడు రిలీజ్ తర్వాత గురువుగా గర్వపడుతున్నానంటున్నాడు. శుక్రవారమే ఉప్పెన సినిమా విడుదలైంది. అనంతరం సక్సెస్‌మీట్‌ను చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
సుకుమార్ మాట్లాడుతూ.. ' సినిమా రిలీజ్ అయిన అన్నిచోట్లనుండి సునామియస్ హిట్ టాక్ వచ్చింది.. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు చాలా చాలా థాంక్స్. నాకు ఇది అద్భుతమైన క్షణం. ఒక శిష్యుడు గురువుని చేసిన రోజు ఇది. ఉప్పెన లాంటి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చి నన్ను నిజమైన గురువుని చేసాడు బుచ్చి. చాలా గొప్పగా ఫీలవుతున్నాను.
నేను ఎప్పుడూ ఏరా, ఏంట్రా బుచ్చి అని పిలిచేవాడ్ని.. కానీ ఈ సినిమా చూసి బయటికి వచ్చి ఏరా బుచ్చి అని పిలవటానికి సంకోచించి.. బుచ్చి అన్నాను.. అదే ఈ సినిమా సక్సెస్‌కి నిదర్శనం. ఒక డైరెక్టర్‌గా నాకు బుచ్చి మీద అంత రెస్పెక్ట్ వచ్చేసింది. తను రాసుకున్న కథని అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. ఒక కొత్త డైరెక్టర్లా చేసినట్టు లేదు. ఎంతో ఎక్స్‌పీరియెన్స్ ఉన్న డైరెక్టర్లా "ఉప్పెన" చిత్రాన్ని వండర్‌ఫుల్‌గా తీశాడు. ప్రీ- రిలీజ్‌లో నేను అన్నట్లు ఇది వంద కోట్ల సినిమా.. అది త్వరలో రుజువు కాబోతుంది.. అన్నారు.
నిర్మాతలు నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ఉప్పెన రిలీజ్ అయిన అన్ని చోట్లనుండి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మా బ్యానర్ లో ఇప్పటివరకు 9 సినిమాలు తీశాం. ఫస్ట్ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మళ్ళీ ఉప్పెన చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన బుచ్చికి, ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు.. అన్నారు.
దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ఉప్పెన చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.. అన్ని ఏరియాల నుండి పెద్ద హిట్ టాక్ వచ్చింది.. మా గురువు గారు సుకుమార్ గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, మెగాభిమానులకు నా ధన్యవాదాలు.. అన్నారు.