రంజుగామారిన కర్ణాటక రాజకీయం.. గవర్నర్‌ కోర్టులో బంతి

బుధవారం, 16 మే 2018 (10:00 IST)
కర్ణాటక రాజకీయం రంజుగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు బంతి ఇపుడు గవర్నర్ కోర్టులో పడింది. దీంతో అందరి కళ్లూ ఇపుడు కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలానే కేంద్రీకృతమయ్యాయి. ముఖ్యంగా, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన తీసుకోబోయే నిర్ణయంపైనే కర్ణాటక ప్రభుత్వం ఎవరిదన్నది తేలుతుంది.
 
ఎవరు ఆ ఛాన్స్‌ దక్కించుకున్నా ఇక అధికారాన్ని నిలుపుకోడానికి అన్ని యత్నాలూ చేసి సఫలమవుతారు కాబట్టి ఎవరికి ఆయన తొలి అవకాశం ఇస్తారన్నదే ఇపుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. అయితే, ఇపుడు గవర్నర్ ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలపై రాజకీయ నిపుణులు తలోరకంగా విశ్లేషిస్తున్నారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ ముందు.. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసిన జేడీఎస్‌ నేత కుమారస్వామిని ఆహ్వానించడం. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యండని కాంగ్రెస్-జేడీఎస్‌ కూటమిని కోరడం. ఆ తర్వాత అత్యధిక స్థానాలు గెల్చుకున్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం... బల నిరూపణకు గడువివ్వడం. చివరగా అసెంబ్లీని సస్పెన్షన్‌లో ఉంచడం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు