సర్దార్ వల్లభాయ్ పటేల్ సరోవరంలో 500 మొసళ్లు.. 9 అడుగుల పొడవు..

ఆదివారం, 27 జనవరి 2019 (11:07 IST)
భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళిగా గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది ఒడ్డున 587 అడుగుల ఎత్తున్న సర్దార్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబర్‌లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
 
ఇక్కడి సర్దార్ సరోవరంలో మొసళ్లు తెగ తిరుగుతున్నాయి. పర్యాటకులను భయపెడుతున్నాయి. ఇంకా పర్యాటకులను చంపి తినేందుకు మొసళ్లు ఆకలితో వున్నాయని.. తెలియరావడంతో.. ఈ జలాశయంలో సీ-ప్లేన్ సర్వీసులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా సందర్శకులు సీ-ప్లేన్‌లో విహరించేందుకు వీలవుతుంది. 
 
ఇందుకోసం జలాశయంలోని దాదాపు 500 మొసళ్లను జాగ్రత్తగా బంధించి వేరే చోటికి తరలిస్తున్నారు. ఇప్పటికే 15 మొసళ్లను తరలించారు. మిగతావాటినీ తీసుకెళ్లే కార్యక్రమం జోరుగా సాగుతోంది. సర్దార్ సరోవర్ జలాశయంలో చిన్నా, పెద్దా 500 వరకూ మొసళ్లు ఉన్నాయి. వీటిలో కొన్ని 9 అడుగుల పొడవున్నాయి. వీటికి చేపల్ని ఎరవేసి ఇనుప బోనుల్లో బంధిస్తున్నారు. గుజరాత్‌లోని పశ్చిమ ప్రాంతానికి తరలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు