అయితే ప్రస్తుతం ఆ డబ్బును తాను తీసుకుంటే చట్ట విరుద్ధమవుతుంది. ఆ ధనాన్ని అలాగే వుంచుకోకూడదు. అందుకే ఆ ధనాన్ని తిరిగి పంపుతున్నా.. దీనికి అర్థం తాను విరాళాలు తీసుకోనని కాదు. తమ పార్టీకి ఇంకా పేరే పెట్టలేదని ఎలాంటి సదుపాయాలు లేకుండానే సేకరించిన విరాళాలను దాచుకుంటే అది నేరమవుతుందని ఆర్టికల్ లో పేర్కొన్నారు. రాజకీయ పార్టీని పెట్టడం కోసం తన అభిమానులు రూ. 30 కోట్ల విరాళాలను సేకరించారని తెలిపారు. "ఆ డబ్బు మీకు తిరిగి ఇచ్చేసినా అది నా డబ్బుగానే భావించాలి.
ఒకవేళ ఖర్చు చేసేస్తే.. మీ వద్ద నుంచి విరాళాలు పొందే భాగ్యం నాకు లేదనుకుంటాను" అంటూ కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. దీని ప్రకారం రాజకీయ పార్టీ ఏర్పరిచిన తర్వాత విరాళాలను తనకు పంపితే సరిపోతుందని.. అప్పటివరకు ఆ డబ్బును మీరు భద్రంగా వుంచుకోవాలని కమల్ హాసన్ తన ఫ్యాన్సుకు చెప్పకనే చెప్పినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
హిందూ ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తూ.. దేశంలో అధిక జనాభా హిందువులదేనని, ఇతర మతస్తులకు హిందువులు అన్నల్లాంటి వారని, ఇతర మతాలవారిని అక్కున చేర్చుకోవాలని, వారు తప్పు చేస్తే సరిదిద్దాలని సూచించారు. తాను హిందువుల కుటుంబం నుంచి వచ్చానని. వారికి తాను వ్యతిరేకం కాదని కమల్ హాసన్ తెలిపారు.