అయితే భక్తుల సౌకర్యార్థం అమర్‌నాథ్ లింగాన్ని ఆన్‌లైన్‌లో దర్శనం చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. భక్తులందరూ తమ తమ ఇళ్లలోనే ఉండి, సౌకర్యవంతంగా, క్షేమంగా మంచు లింగాన్ని దర్శించుకోవచ్చని సూచించారు. ఇదంతా ప్రజల బాగుకోసమేనని ఎల్జీ మనోజ్ సిన్హా తెలిపారు.
కాగా, ప్రతి యేటా 56 రోజుల పాటు జరిగే యాత్ర చేసి 3880 మీటర్ల ఎత్తులో ఉండే పరమేశ్వరుని చేరుకుంటారు. ఈ యాత్రకు రెండు దారులు ఉన్నాయి. ఒకటి పహల్గమ్, రెండు బల్తాల్. ఈ తీర్థ యాత్రను కొవిడ్ కారణంగా 2020లోనూ రద్దు చేశారు.
గత వారం మనోజ్ సిన్హా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయి జమ్మూ అండ్ కాశ్మీరులో సెక్యూరిటీ సిచ్యుయేషన్ గురించి వివరించారు. మీటింగ్‌లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్, యూనియన్ హోం సెక్రటరీ అజయ్ భల్లా, టాప్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.