సవర్ణ హిందువుగా అంబేద్కర్.. ధోతీ, చొక్కా ధరించి, కుర్చీపై కూర్చొని..?

శనివారం, 20 ఆగస్టు 2022 (22:21 IST)
Ambedkar
బాబాసాహేబ్ అంబేద్కర్ పోరాటం ఎనలేనిది. అట్టడుగు, వెనుకబడిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం గురించి భారతీయులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రాసిన పుస్తకాలు ఇందుకు నిదర్శనం. 
 
తాజాగా ఎప్పుడూ లేని విధంగా ఒక పుస్తక కవర్ ఫొటోగా అంబేద్కర్ ఫొటో ఉండడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇందుకు కారణం, అంబేద్కర్‌ను సంప్రదాయ దుస్తుల్లో కూర్చోబెట్టారు.
 
వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన డీసీ బుక్స్ వారు మలయాళీ మెమోరియల్ అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ పుస్తకంపై కవర్ ఫొటోగా అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించారు. 
 
అయితే ఈ చిత్రంలో అంబేద్కర్ ధోతీ, చొక్కా ధరించి, కుర్చీపై కూర్చొని ఉన్నారు. చూస్తుంటే కేరళకు చెందిన సవర్ణ హిందువుగా అంబేద్కర్ కనిపిస్తారు. దీంతో అంబేద్కర్ వాదుల నుంచి ఇతర వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.  
 
''భూస్వామిగా, సవర్ణ హిందువుగా అంబేద్కర్‭ని చూపించడం నేరం. మానవత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఇది అవమానించడమే. ఇది అంబేద్కరిజంపై జరిగిన దాడి'' అని నెటిజెన్లు అంటున్నారు. ప్రస్తుతం ఈ వివాదం నెట్టింట వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు