రైతులూ.. మీరు ఎలాగైనాపోండి... మా జీతాలు 100 శాతం పెంచుకుంటున్నాం...

బుధవారం, 19 జులై 2017 (16:08 IST)
దేశంలో తమిళనాడు రూటే సెపరేటు. ఒకవైపు తమిళ రైతులు నెలల తరబడి దేశ రాజధానిలో ఆందోళన కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలు చేస్తుంటే మరోవైపు తమిళనాడు శాసనసభ సభ్యులు తమకు జీతాలు తక్కువ అని ఫీలైనట్లున్నారు. వెంటనే తమ జీతాలను భారీగా పెంచుకున్నారు.
 
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పళనిస్వామి శాసనసభలో బుధవారం చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే జీతం రూ.55 వేలు ఉండగా దాన్ని అమాంతం రూ.1.05 లక్షలకు పెంచారు. అంటే పెరుగుదల వందశాతమన్నమాట. అలాగే ఎమ్మెల్యేల ఫింఛను రూ.12 వేల నుండి రూ.20 వేలకు పెంచారు.
 
ప్రతిపక్షాలు అన్నీ ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఏమాత్రం అడ్డు చెప్పకుండా సమర్థించడం విశేషం. దీనిపై రైతు సంఘాలు భగ్గుమన్నాయి. శాసనసభ సభ్యులు తాము చేస్తున్న ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోకపోగా, భారీ మొత్తంలో తమ జీతాలను పెంచుకోవడం చాలా బాధాకరమే కాదు.. సిగ్గు చేటని వాపోతున్నారు.

వెబ్దునియా పై చదవండి