రేప్ కేసు పెట్టి నన్ను జైలుకు పంపిస్తావా? ఇప్పుడు మళ్లీ రేప్ చేశా, నీకు దిక్కున్న చోట చెప్పుకో, నన్ను మళ్లీ జైలుకు పంపిస్తే బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ నిన్ను రేప్ చేస్తానని, నీతో పాటు మీ అమ్మ, అన్నను చంపేస్తానని యువతిని బెదిరించాడు.
బెంగుళూరు నగరంలోని కోణనెకుంటలో ఇరవైయేళ్ళ అమ్మాయి నివాసం ఉంటోంది. కాలేజ్ అమ్మాయి నివాసం ఉంటున్న ప్రాంతంలోనే అక్బర్ బాష అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అక్బర్ బాష కాలేజ్ అమ్మాయి వెంటపడ్డాడు.
తనను ఎంతో ప్రేమిస్తున్నాడని, సంతోషంగా చూసుకుంటాడని, పెళ్లి చేసుకుంటాడని కాలేజ్ అమ్మాయి అక్బర్ బాషను నమ్మింది. మొదట్లో అతనితో శారీరకంగానే కలిసినా ఆ తరువాత మాత్రం అక్బర్ బాష యువతి మీద బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ తరువాత పెళ్లి చేసుకోనని అక్బర్ బాష ఎదురుతిరిగాడు. ఆ సమయంలో ఆవేదన చెందిన యువతి మోసం చేసిన అక్బర్ బాష మీద అత్యాచారం కేసు పెట్టడంతో కోణెనెకుంట పోలీసులు అక్బర్ బాషను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
అత్యాచారం కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన అక్బర్ బాష కాలేజ్ నుంచి ఇంటికి వెలుతున్న యువతి మీద దాడి చేశాడు. తరువాత యువతి మీద అత్యాచారం చేసిన అక్బర్ బాష మళ్లీ కేసు పెడితో నీతో పాటు మీ అమ్మ, అన్నను చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అక్బర్ బాషను అరెస్టు చేసి మళ్లీ జైలుకు పంపించారు.