పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రెండు రోజుల పాటు యుద్ధం కూడా జరిగింది. అదేసమయంలో ఉగ్రవాదుల నుంచి తీవ్ర స్థాయిలో బెదిరింపులు వచ్చాయి. అయితే, అవన్నీ బూటకమని నిఘా వర్గాలు తేల్చాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో మరో రెండు రోజుల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవిస్తాయని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ముంబై నగర పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మెయిల్ వచ్చింది. పైగా, ఈ బెదిరింపులను అంత తేలిగ్గా తీసుకోవద్దని అందులో పేర్కొన్నారు.