భారతదేశ స్టార్ పేసర్ మహ్మద్ షమికి (Mohammed Shami) హత్య చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై షమి సోదరుడు హసీబ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రెహా జిల్లా సైబర్ క్రైం పోలీసులకు ఆయన ఫిర్యాదు చేసారు. కోటి రూపాయలు తమకు ఇవ్వాలనీ, ఇవ్వకపోతే షమిని చంపేస్తామంటూ రాజ్ పుత్ సిందార్ అనే వ్యక్తి మెయిల్ ద్వారా సందేశం పంపినట్లు తేలింది. ఆగంతుడి కోసం విచారణ సాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
రాత్రి వెళ్లింది, తెల్లారేసరికి శవమైంది
ఇటీవలి కాలంలో అమ్మాయిలు-అబ్బాయిలు కలిసి రాత్రిపూట పార్టీలు చేసుకోవడం కామన్ అవుతోంది. ఐతే అంతా బాగానే వుంటే సరి. కానీ ఏదైనా తేడా వచ్చిందంటే ఎవరో ఒకరు తెల్లారేసరికి సమస్యల్లో చిక్కుకుని తన్నుకుంటుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని మహానగర్ ప్రాంతంలో 28 ఏళ్ల వయసున్న పవన్ నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఇతడితో పనిచేసే వారితో పరిచయాలున్నాయి. దీనితో తరచూ తను అద్దెకి ఉంటున్న గదికి రమ్మంటూ ఫోన్లు చేస్తుంటారు. వచ్చినవారితో సరదాగా గడపడం అతడి అలవాటు. దీనితో తనకు బాగా పరిచయమున్న 24 ఏళ్ల యువతికి ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. ఆమె వెంటనే అతడి వద్దకు చేరుకుంది. ఇక ఆరోజు రాత్రి ఏమైందో తెలియదు కానీ తెల్లారేసరికి ఆమె శవమై కనబడింది. అతడు పరారీలో వున్నాడు.