సౌతాఫ్రికా నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న 12 చీతా(చిరుత పులి)లలో మరో చిరుత పులి చనిపోయింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఈ చీతాకు చికిత్స అందిస్తుంటగా ఆదివారం సాయంత్రం నాలుగుల సమయంలో ప్రాణాలు విడిచింది. గత నెల రోజుల్లో ఇది రెండో సంఘటన కావడం గమనార్హం. మార్చినా నమీబియా నుంచి భారత్‌కు వచ్చిన చీతా సాషా చనిపోయిన విషయం తెల్సిందే.
దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్న చీతాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో వదిలిపెట్టారు. వీటిలో ఒకటి గత మార్చి నెలలో చనిపోగా, మరో చీతా ఆదివారం మృత్యువాతపడింది. చనిపోయిన చీతా మగ చిరుతపులి అని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ జీఎస్ చౌహాన్ తెలిపారు. అనారోగ్యం బారినపడటంతో చికిత్స అందిస్తుండగా చనిపోయిందని తెలిపారు. అయితే, ఈ చీతా మరణానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
కాగా, ఈ యేడాది ఫిబ్రవరి నెల 18వ తేదీన సౌతాఫ్రికా నుంచి 12 చీతాలను కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చారు. అందులో గత యేడాది నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాల్లో ఒకటైన నాషా ఈ యేడాది మార్చి నెలలో చనిపోయింది. ఇపుడు మరో చీతా మరణించడంతో అటవీ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.