తాజా సర్వే తెలిపిన వివరాల ప్రకారం... అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం 2017, 2018 సంవత్సరాలను పోలుస్తూ వెల్లడించిన ఈ సర్వేలో.. భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగినా వృద్ధిశాతం మాత్రం గణనీయంగా తగ్గిందని తేలింది.
అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. 2017 కంటే 2018 లో మన వారు 4,157 మంది పెరిగారు. అదే సమయంలో అగ్రరాజ్యంలో చదువు కోసం వచ్చే మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య 26,120 తగ్గింది.
దీంతో విద్యార్థి వీసాపై ఉన్న వారి సంఖ్యలో స్వల్ప పెరుగుదల ఉందని భావిస్తున్నారు. మూడు నాలుగేళ్లుగా భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్‌తోపాటు జర్మనీ, ఐర్లాండ్ తదితర దేశాలను ఎంచుకుంటున్నారని వారు చెబుతున్నారు.