మాస్కు పెట్టుకోలేదని.. బూట్లతో జవాన్ కడుపులో తన్నారు.. ఎవరు..?

గురువారం, 2 సెప్టెంబరు 2021 (14:03 IST)
భారత సైన్యానికి చెందిన జవాన్‌కు అవమానం జరిగింది. జార్ఖండ్ పోలీసులు జవాన్‌ను చితకబాదారు. జార్ఖండ్ ఛాత్రా జిల్లాలో ఈ ఘటన జరిగింది. మాస్క్ పెట్టుకోలేదని జవాన్‌పై పోలీసులు దాడి చేశారు. బూట్లతో జవాన్ కడుపులో తన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనను భారత ఆర్మీ తీవ్రంగా ఖండించింది. 
 
దీంతో ముగ్గురు పోలీసుల్ని, ఇద్దరు అధికారుల్ని విధుల నుంచి తొలగించారు. ఛాత్రా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. పోలీసులు చితకబాదిన జవాన్‌ను పవన్ కుమార్ యాదవ్‌గా గుర్తించారు. ఛాత్రాలోని కర్మా బజార్ ప్రాంతంలో కొందరు పోలీసులు రౌండప్ చేసి మరీ జవాన్‌ను కొట్టారు.
 
పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో .. ఆ రూట్లో బైక్‌పై వచ్చిన జవాన్ యాదవ్‌ను అడ్డుకున్నారు. మాస్క్ లేకపోవడంతో నిలదీశారు. బైక్ తాళాలు లాక్కున్న ఓ పోలీసు చర్య పట్ల ఆర్మీ జవాన్ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, జవాన్ల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది.

Army jawan beaten up by police personnel in Jharkhand#Jharkhand #ViralVideo pic.twitter.com/VCPHNeyx3R

— VR (@vijayrampatrika) September 2, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు