ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... మోడీ ప్రభుత్వానిది ఏకవ్యక్తి పాలన. దీనివల్ల భారత ప్రజాస్వామ్యానికి చేటు తప్పదు. ప్రజలను వాడుకొని వదిలేయడం ప్రధాని వైఖరి అని ఆయన ధ్వజమెత్తారు.