జమ్మూకాశ్మీర్ జంట పేలుళ్లు కలకలం.. ఎమ్మెల్యే ఇంటి వద్ద కూడా?

శనివారం, 21 జనవరి 2023 (14:52 IST)
జమ్మూకాశ్మీర్ జంట పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ పేలుళ్లు ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూలోని నర్వాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు జమ్మూ ఏడీజీపీ ముకేష్ సింగ్ తెలిపారు. 
 
మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మాజీ శాసనసభ్యుని ఇంట్లో పేలుడు సంభవించినట్లు అధికారులు శనివారం తెలిపారు.
 
సూరంకోట్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ గుజ్జర్ నాయకుడు చౌదరి మహ్మద్ అక్రమ్ మాట్లాడుతూ శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని, లస్సానా గ్రామంలోని తన ఇంటి పలు గదుల పైకప్పుకు చీలికలు రావడంతో అతని కుటుంబం తృటిలో తప్పించుకుందని చెప్పారు.
 
"సంఘటన జరిగిన సమయంలో నేను ఇంట్లో లేను. తర్వాత, శక్తివంతమైన పేలుడు జరిగిందని, ఆ తర్వాత కొన్ని కాల్పులు జరిగాయని నాకు తెలిసింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఆర్మీ అధికారులు నా ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు" అని అక్రమ్ తెలిపారు.
 
గత ఏడాది జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు సంఘీభావంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అక్రమ్, ఆజాద్ డెమోక్రటిక్ ఆజాద్ పార్టీకి దూరమయ్యారు, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు