కరోనా వైరస్ సూపర్ స్పైడర్‌గా మారుతోంది. ఒకర నుంచి అనేకమందికి అంటే పదుల సంఖ్యలో ఈ వైరస్ సోకుతోంద. తాజాగా ఓ కరోనా రోగి అంత్యక్రియల్లో పాల్గొన్న 21 మందికి ఈ వైరస్ సోకింది. దీనికి కారణం కరోనా నిబంధనలను తుంగలో తొక్కడమే. కొవిడ్-19 సోకిన రోగి అత్యంక్రియల్లో కరోనా నిబంధనలు పాటించకుండా ఖననం చేసిన ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు.
అయితే, వీరంతా కరోనా నిబంధనలు పాటించకుండా మృతదేహాన్ని ఖననం చేశారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో నుంచి బయటకు తీసినట్లు, ఖననం చేసే సమయంలో చాలా మంది దానిని తాకినట్లు స్థానికులు తెలిపారు. మొత్తం 21 మరణాలలో కేవలం ముగ్గురు లేదా నలుగురు మాత్రమే కొవిడ్-19తో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
కొవిడ్-19తోనే మరణించారా? లేదా అని తెలుసుకునేందుకు తాము 147 కుటుంబాల నుండి శాంపిల్స్‌ను సేకరించినట్లు అధికారులు తెలిపారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామంలో శానిటైజేషన్ డ్రైవ్‌ను చేపట్టినట్లు వెల్లడించారు. అదేవిధంగా సమస్య తీవ్రతను గురించి గ్రామస్థులకు వివరించడం జరిగిందన్నారు.