రాజ్‌కోట్‌లో ఆటోడ్రైవర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దుమారం రేపుతోంది. అతడిని గొడ్డును బాధినట్టుబాది తీవ్రగాయాల పాలయ్యేలా చేశారు పోలీసులు. ఇంతలా కొట్టారంటే... అతడు చేసిన తప్పు గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. వేగంగా వస్తున్న ఆటోరిక్షాను పొరపాటున పోలీస్ జీపుకు ఢీకొట్టడమే. ఆంతే ఆక్రోషంతో ఊగిపోయిన పోలీసులు హుటాహుటిన జీపులో నుండి శరవేగంగా బయటకు దూకి అతడిపై దాడికి దిగారు.