అయోధ్యకు అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్స్ రెండూ ఉంటాయని, యూపీలోని అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా ఉండవచ్చని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ 2018 నవంబర్‌లో దీపావళి సందర్భంగా దీపాత్సవ్ సందర్భంగా ప్రకటించారు.
ఇంకా అయోధ్య విమానాశ్రయాన్ని మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ విమానాశ్రయంగా మారుస్తూ మంత్రివర్గం తాజాగా తీర్మానించింది. టెంపుల్ టౌన్ అయోధ్యలోని విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెడుతూ మంత్రివర్గం నిర్ణయించింది. అయోధ్యలో విమానాశ్రయం నిర్మాణానికి భూసేకరణ ప్రారంభమైంది. భూసేకరణ పూర్తి కాగానే కేంద్ర పౌరవిమానయాన శాఖ విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టనుంది.