ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం కార్యదర్శి రాజేశ్ కోటేచా ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. అయితే, హిందీ రానివాళ్లు ఈ సమావేశం నుంచి వెళ్లిపోవచ్చని కోటేచా వ్యాఖ్యానించారు. ఈ విషయం బయటకు లీక్ కావడంతో తమిళ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
కాగా, తమిళ ప్రజలకు భాషాభిమానం నరనరాన జీర్ణించుకునిపోయింది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ భాషకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన చరిత్ర వారిది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు తమిళుల్లో ఆగ్రహజ్వాలలు రగిల్చాయి.